స్పుత్నిక్-వితో ట్రయల్స్‌కు డాక్టర్ రెడ్డీస్ దరఖాస్తు
ABN , First Publish Date - 2020-10-04T08:11:37+05:30 IST
రష్యా అభివృద్ధిచేసిన ప్రపంచంలోనే మొదటి కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’తో మనుషులపై మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు కోరుతూ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్...
న్యూఢిల్లీ, అక్టోబరు 3 : రష్యా అభివృద్ధిచేసిన ప్రపంచంలోనే మొదటి కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’తో మనుషులపై మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు కోరుతూ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు దరఖాస్తు సమర్పించింది. దేశంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ల పంపిణీ బాధ్యతలను చేపట్టేందుకుగానూ రష్యా డైరెక్ట్ ఇన్వె్‌స్టమెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎ్‌ఫ)తో డాక్టర్ రెడ్డీస్ ఆగస్టులోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి సంబంధిత నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు మంజూరైతే.. తొలివిడతగా డిసెంబరుకల్లా పది కోట్ల వ్యాక్సిన్ డోసులు రష్యా నుంచి రెడ్డీ్‌సకు చేరే అవకాశాలు ఉన్నాయి.