కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన తాజా సమాచారమిదే

ABN , First Publish Date - 2020-04-28T18:14:02+05:30 IST

న్యూఢిల్లీ: దేశంలోని 80 జిల్లాల్లో గత ఏడు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ తెలిపారు.

కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన తాజా సమాచారమిదే

న్యూఢిల్లీ: దేశంలోని 80 జిల్లాల్లో గత ఏడు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ తెలిపారు. 47 జిల్లాల్లో గత 14 రోజులుగా, 39 జిల్లాల్లో గత 21 రోజులుగా, 17 జిల్లాల్లో గత 28 రోజులుగా ఒక్క కేసూ నమోదు కాలేదన్నారు. డిపార్ట్‌మెంట్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


రెండు వారాల క్రితం భారత్‌లో కరోనా కేసుల రెట్టింపునకు 8.7 రోజులు పడుతుండగా గత వారంలో 10.2 రోజులు పట్టిందని హర్ష్ వర్ధన్ తెలిపారు. గత మూడు రోజుల్లో కేసుల రెట్టింపునకు 10.9 రోజులు పట్టిందని చెప్పారు. దేశంలో 300 జిల్లాలు నాన్ హాట్‌స్పాట్‌గా ఉన్నాయని, 129 జిల్లాల్లో 50కి పైగా కరోనా కేసులున్నాయని హర్ష్ వర్ధన్ చెప్పారు. 

Updated Date - 2020-04-28T18:14:02+05:30 IST