పాత సీరియళ్ళ కోసం ప్రత్యేక ఛానల్ ప్రారంభం

ABN , First Publish Date - 2020-04-15T13:11:52+05:30 IST

లాక్‌డౌన్ సమయంలో ప్రేక్షకుల డిమాండ్‌పై దృష్టి పెట్టిన దూరదర్శన్ పాత సీరియళ్లు ప్రసారం చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో....

పాత సీరియళ్ళ కోసం ప్రత్యేక ఛానల్ ప్రారంభం

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ సమయంలో ప్రేక్షకుల డిమాండ్‌పై దృష్టి పెట్టిన దూరదర్శన్ పాత సీరియళ్లు ప్రసారం చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో దూరదర్శన్ ఛానెల్స్ టీఆర్పీలో అగ్రస్థానంలో నిలిచాయి. కాగా లాక్డౌన్ పొడిగింపును ప్రధాని నరేంద్ర మోదీ మోడీ ప్రకటించే ముందు దూరదర్శన్ మరో ఛానల్ డిడి రెట్రోను ప్రారంభించింది. దూరదర్శన్ కు చెందిన సీరియల్స్ ఈ ఛానెల్‌లో ప్రసారం అవుతాయి. 'మీరు మహాభారతం చూడలేకపోతే, సోమవారం రాత్రి 8 గంటల నుండి డిడి రెట్రోలో చూడండి' అని దూరదర్శన్ ఒక ట్వీట్‌లో పేర్కొంది. దీని తరువాత అనేక ఇతర ట్వీట్లు వచ్చాయి. వీటిలో శక్తిమాన్, చాణక్య, ఉపనిషద్ గంగా, దేఖ్ భాయ్ దేఖ్, బునియాద్, మహాభారతం తదితర సీరియల్స్ ప్రసారాల గురించి సమాచారం అందించారు. కాగా లాక్డౌన్ ముగిసినప్పటికీ పాత సీరియల్స్ కారణంగా ప్రైవేట్ ఛానెల్‌లకు గట్టి పోటీనిచ్చే శక్తి ఈ ఛానెల్‌కు ఉందని నిపుణులు అంటున్నారు.  

Updated Date - 2020-04-15T13:11:52+05:30 IST