రైతుల సహనాన్ని పరీక్షించవద్దు : శరద్ పవార్

ABN , First Publish Date - 2020-12-11T22:20:17+05:30 IST

రైతుల సహనాన్ని కేంద్రం పరీక్షించవద్దని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రాన్ని హెచ్చరించారు. రైతుల డిమాండ్ల విషయంలో ఓ గడువు

రైతుల సహనాన్ని పరీక్షించవద్దు : శరద్ పవార్

ముంబై : రైతుల సహనాన్ని కేంద్రం పరీక్షించవద్దని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రాన్ని హెచ్చరించారు. రైతుల డిమాండ్ల విషయంలో ఓ గడువు వెల్లడించకుండా ఉంటే.. ఈ ఉద్యమం ఇతర ప్రాంతాలకూ విస్తరించే అవకాశాలున్నాయని ఆయన పునరుద్ఘాటించారు. ఈ వ్యవసాయ బిల్లులపై కూలంకశంగా చర్చ జరగాలని ప్రతిపక్షాలు సభలో కోరితే, సర్కారు హడావుడిగా ఆ బిల్లులకు ఆమోదం తెలుపుకున్నాయని మండిపడ్డారు. చర్చల విషయంలో రైతులు, ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన ఏర్పడిందని, ఈ ప్రతిష్టంభన మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులు దేశానికి అన్నంపెట్టే అన్నదాతలని, వారి సహనాన్ని పరీక్షించవద్దని పవార్ కేంద్రాన్ని హెచ్చరించారు. 

Updated Date - 2020-12-11T22:20:17+05:30 IST