గల్వాన్ ఘర్షణను చూపి.. భావోద్వేగాలతో ఆడుకోకండి: కమల్ హాసన్

ABN , First Publish Date - 2020-06-22T04:29:03+05:30 IST

లడఖ్‌లోని గల్వాన్‌లో భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణను అడ్డుపెట్టుకొని ప్రధాని మోదీ, ఆయన అనుయాయులు ప్రజల భావోద్వాగాలను మానిప్యులేట్ చేస్తున్నారని

గల్వాన్ ఘర్షణను చూపి.. భావోద్వేగాలతో ఆడుకోకండి: కమల్ హాసన్

చెన్నై: లడఖ్‌లోని గల్వాన్‌లో భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణను అడ్డుపెట్టుకొని ప్రధాని మోదీ, ఆయన అనుయాయులు ప్రజల భావోద్వాగాలను మానిప్యులేట్ చేస్తున్నారని ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ ఆరోపించారు. ఇలా ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం ఆపాలని వారికి సూచించారు. గల్వాన్‌లో ఇటీవల చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘటన గురించి ప్రధాని ఇచ్చిన వివరణపై పలువురు రాజకీయవేత్తలు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై కూడా కమల్ గళమెత్తారు. ‘ప్రశ్నిస్తే దేశద్రోహం చేసినట్లేనా? వాటిని అలా చూడకూడదు. అసలు ప్రజాస్వామ్య మూలమే ప్రశ్నించే హక్కు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-06-22T04:29:03+05:30 IST