అయోధ్యకు రావొద్దు.. భక్తులకు చెప్పిన ఆలయట్రస్టు!
ABN , First Publish Date - 2020-07-28T04:18:10+05:30 IST
రామమందిర భూమి పూజ వేడుకను చూడటానికి ప్రజలు అయోధ్యకు రావొద్దని, ఇంటి వద్దే వేడుకలు చేసుకోవాలని

అయోధ్య: రామమందిర భూమి పూజ వేడుకను చూడటానికి ప్రజలు అయోధ్యకు రావొద్దని, ఇంటి వద్దే వేడుకలు చేసుకోవాలని రామాలయ ట్రస్టు జనరల్ సెక్రటరీ ఛాంపత్ రాయ్ చెప్పారు. కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో భూమిపూజకు రావాలనే ఆలోచన చేయొద్దని ఆయన భక్తులకు విన్నవించారు. ఇంట్లోనే వేడుకలు చేసువాలని అని సూచించారు. ఇది స్వతంత్ర భారతంలో అత్యంత చరిత్రాత్మక కార్యక్రమం రాయ్ పేర్కొన్నారు.