కరోనా లక్షణాలుంటే.. ఆగస్టు 15 వేడుకలకు రావొద్దన్న పోలీసులు!
ABN , First Publish Date - 2020-08-13T04:40:01+05:30 IST
దేశరాజధాని న్యూఢిల్లీలో ఆగస్టు 15న జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు కరోనా లక్షణాలున్న అతిథులు రావొద్దని ఢిల్లీ పోలీసులు కోరారు.

న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో ఆగస్టు 15న జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు కరోనా లక్షణాలున్న అతిథులు రావొద్దని ఢిల్లీ పోలీసులు కోరారు. ఎర్రకోటలో జరిగే ఈ వేడుకలకు వచ్చే అతిథులకు పోలీసులు ఈ సూచన చేశారు. ఆగస్టు 15కు రెండు వారాల ముందు ఎప్పుడైనా తమలో కరోనా లక్షణాలు కనిపిస్తే ఉత్సవాలకు రాకుండా ఉంటే మంచిదని చెప్పారు. అలాగే కార్యక్రమానికి హాజరయ్యే వారు కూడా కరోనా విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని అతిథులను తెలియజేశారు.