డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన సర్వే

ABN , First Publish Date - 2020-06-19T02:30:16+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ షాకయ్యే సర్వే ఒకటి బయటకు వచ్చింది.

డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన సర్వే

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ షాకయ్యే సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ట్రంప్ ఓడిపోవడం ఖాయమన్నదే ఆ సర్వే సారాంశం. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య, కరోనా వైరస్ మహమ్మారి వంటివి ట్రంప్‌కు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ వైట్ హౌస్‌కు వెళ్లడం ఖాయమని తెలిపింది. మే 28, జూన్ 4 మధ్య జరిగిన పోల్‌లో ట్రంప్ ఆమోదం రేటింగ్ 39 శాతానికి పడిపోయిందని పోల్‌స్టర్ గాలప్ బుధవారం తెలిపింది. ఇది ట్రంప్ పదవీకాల సగటు 40 కంటే తక్కువ. అంతకుముందు పదవీకాల సగటు 49 శాతం గరిష్ట స్థాయితో పోలిస్తే ఇది బాగా తక్కువ. ట్రంప్ రేటింగ్ అన్ని గ్రూపుల్లోనూ గణనీయంగా పడిపోతోందని సర్వే వెల్లడించింది.  

Updated Date - 2020-06-19T02:30:16+05:30 IST