సమాధిపై మాస్కులేయమన్న డాక్టర్‌కు రాహుల్ సమాధానం

ABN , First Publish Date - 2020-03-24T21:41:10+05:30 IST

అయితే డాక్టర్ కమ్మ కక్కర్ అనే వైద్యురాలు కరోనా మహమ్మారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నా వరకు వచ్చే వారు న్95 మాస్కులు, గ్లౌజులు నా సమాధిపై ఎవేసిపోండి. చప్పట్లు కొడుతున్నారు. కేవలం చప్పట్లు మాత్రమే కొడుతున్నారు.

సమాధిపై మాస్కులేయమన్న డాక్టర్‌కు రాహుల్ సమాధానం

న్యూఢిల్లీ: తన సమాధిపై మాస్కులు వేయాలంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన ఓ డాక్టర్‌కు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. కరోనా నివారించగలిగేదే అయినప్పటికీ ముందస్తు చర్యల్లో మనం వెనుకబడి ఉన్నామని ఆయన అన్నారు. వైద్యులే ఇంతటి ఆవేదనలో ఉండడం బాధాకరమని వ్యాఖ్యానించారు.


విషయమేంటంటే.. డాక్టర్ కమ్మ కక్కర్ అనే వైద్యురాలు కరోనా మహమ్మారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నా వరకు వచ్చే వారు న్95 మాస్కులు, గ్లౌజులు నా సమాధిపై ఎవేసిపోండి. చప్పట్లు కొడుతున్నారు. కేవలం చప్పట్లు మాత్రమే కొడుతున్నారు. అభినందనలే కావచ్చు. కాకపోతే ప్రభుత్వ వైద్యులు తీవ్ర నిరాశలో ఉన్నారు’’ అనే అర్థంలో ఆమె ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్, హర్యానా ముఖ్యమంత్రి కార్యాలయం, హర్యానా ఆరోగ్యమంత్రి అనిల్ విజ్‌లను ట్యాగ్ చేశారు.


కాగా ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన రాహుల్ గాంధీ.. ‘‘చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఇది పూర్తిగా నివారించగలిగేదే. దీని కోసం మనకు సమయం కూడా ఉండేది. ఈ విషయంపై చాలా తీవ్రంగానే స్పందించాము. దీనిపై అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాలి’’ అని రాహుల్ రాసుకొచ్చారు. చివరలో కరోనా వైరస్ ఒక క్రిమి అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.

Updated Date - 2020-03-24T21:41:10+05:30 IST