2 వేల ఉంగరాలతో కరోనాపై ఓ కన్నేసుంచిన డాక్టర్లు..

ABN , First Publish Date - 2020-03-25T01:04:36+05:30 IST

యూనివర్శిటీ ఆఫ్ శాన్‌ఫ్రాన్సిస్కో(యూసీఎస్‌ఎఫ్), ఔరా స్మార్ట్ రింగ్స్ సంయుక్తంగా స్మార్ట్ ఉంగరాలను రూపొందిచాయి. వీటిని వైద్యులు నిరంతరం ధరించడం ద్వారా వారి ఆరోగ్య స్థితిగతులపై ముఖ్యంగా ఉష్ణోగ్రతలపై ఓ కన్నేసి ఉంచోచ్చు.

2 వేల ఉంగరాలతో కరోనాపై ఓ కన్నేసుంచిన డాక్టర్లు..

శాన్‌ఫ్రాన్సిస్కో: కరోనాతో పోరులో ప్రజలందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. వ్యాధి కట్టడికోసం బిగ్ డెటా నుంచి ఏఐ దాకా అన్ని అస్త్రాలను వినియోగిస్తున్నారు. మరి ఈ యుద్ధంలో ముందు వరుసలో నులుచుని పోరాడేవారు ఎవరైనా ఉన్నారంటే వారు వైద్య సిబ్బంది మాత్రమే. ఈ నేపథ్యంలోనే యూనివర్శిటీ ఆఫ్ శాన్‌ఫ్రాన్సిస్కో(యూసీఎస్‌ఎఫ్), ఔరా స్మార్ట్ రింగ్స్ సంయుక్తంగా స్మార్ట్ ఉంగరాలను రూపొందిచాయి. వీటిని వైద్యులు నిరంతరం ధరించడం ద్వారా వారి ఆరోగ్య స్థితిగతులపై ముఖ్యంగా ఉష్ణోగ్రతలపై ఓ కన్నేసి ఉంచోచ్చు. కాస్తంత టెంపరేచర్ పెరిగినా సరే..తగు జాగ్రత్తలు తీసుకుని ఐసోలేషన్‌లోకి వెళ్లడం ద్వారా వ్యాధి వ్యాప్తిగి నిరోధించవచ్చు. ఈ విధంగా కరోనా రోగులకు చికిత్స నందిస్తున్న డాక్టర్లు తమకు ఈ వ్యాధి సోకకుండా మహమ్మారిపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. ప్రస్తుతం యూసీఎస్‌ఎఫ్ మెడికల్ సెంటర్, జుకర్‌బర్గ్ శాన్‌ఫ్రాన్సిస్కో జనరల్ హాస్పిటళ్లలోని 2 వేల మంది సిబ్బంది వీటిని వినియోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఉంగరాల ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించడం ద్వారా కరోనా పూర్తి పట్టు లభిస్తుందని అశాభావం వ్యక్తమవుతోంది. ఉంగరం రూపకర్తలైన రెండు సంస్థలూ మరో 15 వేల మందికి ఈ ఉంగారలను ఇవ్వాలని తలపోస్తున్నాయి. వీరి నుంచి సేకరించిన డాటా ఆధారంగా ఉంగరంలోని ఆల్గోరిథంను మరింత పటిష్ట పరిచి కరోనాకు ముకుతాడు వేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు.  సాధారణ వ్యక్తులు కూడా వీటిని ధరించడం ద్వారా తమ ఆరోగ్యంపై పూర్తి నిఘా పెట్టోచ్చిని, ఈ వివరాలను వారు ప్రభుత్వంతో పంచుకుంటే కరోనాకు పూర్తిగా చెక్ పెట్టొచ్చని స్మార్ట్ ఉంగరం చెబుతున్నారు.   

Updated Date - 2020-03-25T01:04:36+05:30 IST