మరణించిన వారికి కరోనా పరీక్షలు వద్దు: ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-05-19T00:37:14+05:30 IST

దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇప్పటికే భారత్‌లో కరోనా కేసులు లక్షకు చేరువయ్యాయి.

మరణించిన వారికి కరోనా పరీక్షలు వద్దు: ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇప్పటికే భారత్‌లో కరోనా కేసులు లక్షకు చేరువయ్యాయి. ఈ తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మరణించిన వారికి కరోనా పరీక్షలు చేయొద్దని ఆస్పత్రి వర్గాలకు సూచించింది. సదరు మృతుడిలో కరోనా లక్షణాలున్నాయని వైద్యులు భావిస్తే, ఆ మృతదేహాన్ని కరోనా అనుమానితుడిగా భావించాలని చెప్పింది. అంతేగానీ ఆ శరీరానికి కరోనా టెస్టులు చేయొద్దని చెప్పింది. కరోనా టెస్టింగ్ కిట్ల వాడకాన్ని తగ్గించడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - 2020-05-19T00:37:14+05:30 IST