కరోనాను రూపుమాపుతామనే భ్రమలొద్దు

ABN , First Publish Date - 2020-06-01T07:11:44+05:30 IST

కరోనా మహమ్మారికి సంబంధించి నరేంద్ర మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు పట్ల మూడు ప్రముఖ వైద్య వృత్తి నిపుణుల అసోసియేషన్లు తీవ్ర విమర్శలు చేశాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వం అంటువ్యాధుల...

కరోనాను రూపుమాపుతామనే భ్రమలొద్దు

  • మోదీ సర్కారుపై ఆరోగ్య నిపుణుల ధ్వజం


న్యూఢిల్లీ, మే 31: కరోనా మహమ్మారికి సంబంధించి నరేంద్ర మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు పట్ల మూడు ప్రముఖ వైద్య వృత్తి నిపుణుల అసోసియేషన్లు తీవ్ర విమర్శలు చేశాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వం అంటువ్యాధుల నిపుణులపై ఆధారపడకుండా సాధారణ పరిపాలనా అధికారులపైనే ఆధారపడుతున్నట్టు పేర్కొన్నాయి. ఈ మేరకు ఇటీవలే ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ అసోసియేషన్‌, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజిస్ట్స్‌ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇప్పటికే దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి జరుగుతోందని ఇందులో పేర్కొన్నారు సామాజిక వ్యాప్తి ఉన్న దశలో కరోనా మహమ్మారిని అంతమొందించాలని ఆశించడం భ్రమనే అవుతుందన్నారు. ఈ ప్రకటనపై ఎయిమ్స్‌ సెంటర్‌ ఫర్‌ కమ్యూనిటీ మెడిసిన్‌ హెడ్‌, డాక్టర్‌ శశికాంత్‌, డాక్టర్‌ డీసీఎస్‌ రెడ్డి సంతకాలు చేశారు. వీరిద్దరూ ఐసీఎంఆర్‌ పరిశోధనా బృందంలో సభ్యులుగా ఉన్నారు. 


Updated Date - 2020-06-01T07:11:44+05:30 IST