చైనీయులు వద్దంటూ వార్తలు.. నిజం కాదన్న కేంద్రం

ABN , First Publish Date - 2020-12-29T00:11:54+05:30 IST

అయితే ఈ వార్త ఎంత మాత్రం నిజం కాదని విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి సోమవారం స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఏ దేశ పౌరులకైనా ప్రయాణాలపై పరిమితులు విధించడం సరి కాదు. విమానయాన సంస్థలకు కానీ మరే

చైనీయులు వద్దంటూ వార్తలు.. నిజం కాదన్న కేంద్రం

న్యూఢిల్లీ: భారత విమానాల్లోకి చైనీయులను అనుమతించ వద్దంటూ అన్ని విమానయాన సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు వార్తలు గుప్పుతమన్నాయి. కేంద్రం ప్రతిపాదనను విమానయాన సంస్థలు ధృవీకరించినట్లు కూడా ప్రధాన మీడియాలోనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాము అలాంటి ప్రతిపాదనేదీ చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


కరోనా వైరస్ విజృంభణ నేపధ్యంలో వివిధ దేశాల నుంచి విమాన ప్రయాణాల్ని రద్దు చేస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ లాంటి దేశాల నుంచి భారత్‌కు విమాన సర్వీసుల్ని నిలిపివేశారు. అదే విధంగా చైనా వీదేశీయులను కూడా భారత్‌లోకి అనుమతించవద్దని విమాన సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు అనధికార వర్గాలు చెప్పాయని పుకార్లు వచ్చాయి. గతంలో కరోనా వైరస్‌ వ్యాప్తిస్తున్న తరుణంలో చైనాతో విమాన సర్వీసులను భారత్‌ నిలిపివేసింది. అయితే కరోనా లాక్‌డౌన్ తర్వాత అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం పలు దేశాలతో భారత్ 2ఎయిర్ బబూల్స్’ తెరచడంతో ఆ దేశాల్లో నివసించే చైనీయులు భారత్ రావడానికి అవకాశం ఏర్పడింది. తాజాగా చైనీయులను అనుమతించవద్దని ఎయిర్‌లైన్స్‌ను కేంద్ర ప్రభుత్వం కోరినట్లు, దానికి విమానయాన సంస్థలు ఒకే అన్నట్లు వార్తలు వచ్చాయి.


అయితే ఈ వార్త ఎంత మాత్రం నిజం కాదని విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి సోమవారం స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఏ దేశ పౌరులకైనా ప్రయాణాలపై పరిమితులు విధించడం సరి కాదు. విమానయాన సంస్థలకు కానీ మరే ఇతర వ్యవస్థలకు కానీ మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. పూర్తిగా తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి’’ అని అన్నారు.

Updated Date - 2020-12-29T00:11:54+05:30 IST