కరోనా నుంచి ఫేస్ మాస్క్ కాపాడుతుందా?... ఎప్పుడు పెట్టుకోవాలంటే?

ABN , First Publish Date - 2020-03-16T12:57:59+05:30 IST

కరోనా వైరస్(కోవిడ్-19) ప్రభావం పెరుగుతోంది. దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 100ను దాటింది. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ విషయమై ప్రజల్లో పలు అపోహలు తెలెత్తుతున్నాయి.

కరోనా నుంచి ఫేస్ మాస్క్ కాపాడుతుందా?... ఎప్పుడు పెట్టుకోవాలంటే?

న్యూఢిల్లీ: కరోనా వైరస్(కోవిడ్-19) ప్రభావం పెరుగుతోంది. దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 100ను దాటింది. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ విషయమై ప్రజల్లో పలు అపోహలు తెలెత్తుతున్నాయి. కాగా ఈ వైరస్ నుంచి దూరంగా ఉండేందుకు ప్రజలు విరివిగా మాస్క్‌లను వినియోగిస్తున్నారు. కాగా కరోనా నుంచి దూరంగా ఉండేందుకు ఎటువంటి మాస్క్ ధరించాలి? ఎప్పుడు పెట్టుకోవాలనే విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏఐఐఎంఎస్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులెరియా మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు రెండు విధాలైన మాస్క్‌లు ఉన్నాయని తెలిపారు. వాటిలో ఒకటి సర్జికల్ మాస్క్, మరొకటి ఎన్-95. కరోనా వైరస్ ప్రభలుతున్న నేపధ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదన్నారు. అలాగే మాస్క్‌లు ధరించడం వలన కరోనా రాదని నిర్ధారించే అధికారిక డాటా ఏమీ లేదన్నారు. జలుబు, దగ్గు ఉన్నవారు మాస్క్ పెట్టుకోవడం శ్రేయస్కరమన్నారు. అలాగే బయట బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోవడం ఉత్తమమని తెలిపారు. ఆసుపత్రులలో పనిచేస్తున్నవారు ఎన్-95 మాస్క్ ధరించడం అవసరమన్నారు. తద్వారా రోగుల నుంచి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు అవకాశముంటుందన్నారు. 


Updated Date - 2020-03-16T12:57:59+05:30 IST