డీఎంకే మేనిఫెస్టో తయారీకి 8 మందితో కమిటీ

ABN , First Publish Date - 2020-10-12T14:25:41+05:30 IST

రాష్ట్రంలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే సిద్ధమవుతుంది. అందులో భాగంగా ఎన్నికల మేనిఫెస్టో తయారీకి ఎనిమిది మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు...

డీఎంకే మేనిఫెస్టో తయారీకి 8 మందితో కమిటీ

చెన్నై : రాష్ట్రంలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే సిద్ధమవుతుంది. అందులో భాగంగా ఎన్నికల మేనిఫెస్టో తయారీకి ఎనిమిది మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ తెలిపారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వ పదవీకాలం 2021 మే నెలతో ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికలు ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డీఎంకే మేనిఫెస్టో రూపకల్పనకు 8 మందితో కూడిన కమిటీని నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ ఆదివారం వెలువరించిన ప్రకటనలో... మేనిఫెస్టో కమిటీలో పార్టీ కోశాధికారి టీఆర్‌ బాలు, ఉప ప్రధాన కార్యదర్శులు సుబ్బలక్ష్మి జగదీశన్‌, ఎ.రాజా, అందియూర్‌ సెల్వరాజ్‌, ఎంపీలు కనిమొళి, తిరుచ్చి శివ, టీకేఎస్‌ ఇళంగోవన్‌, ప్రొఫెసర్‌ రామస్వామి తదితరులున్నారు.

Updated Date - 2020-10-12T14:25:41+05:30 IST