‘డీఎండీకే నేతృత్వంతో తృతీయ ఫ్రంట్‌..!’

ABN , First Publish Date - 2020-10-27T16:23:37+05:30 IST

డీఎండీకే ఆధ్వర్యంలో తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటయ్యే అవకాశముందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌ కుమారుడు విజయ్‌ ప్రభాకరన్‌ తెలిపారు. మదురైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తన తండ్రి విజయకాంత్‌ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఆయనకు చికిత్సలు అందించిన వైద్యులు, నర్సులు,

‘డీఎండీకే నేతృత్వంతో తృతీయ ఫ్రంట్‌..!’

చెన్నై : డీఎండీకే ఆధ్వర్యంలో తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటయ్యే అవకాశముందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌ కుమారుడు విజయ్‌ ప్రభాకరన్‌ తెలిపారు. మదురైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తన తండ్రి విజయకాంత్‌ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఆయనకు చికిత్సలు అందించిన వైద్యులు, నర్సులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇప్పటికే ఎన్నికల పనులు ప్రారంభించామన్నారు. కార్యవర్గ, జనరల్‌ కమిటీ సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నామన్నారు. డీఎండీకే ప్రారంభంలో ఒంటిరిగా పోటీ చేసిందని, ప్రస్తుతం కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తుమన్నారు. ఒంటిరిగా పోటీ చేసే సత్తా డీఎండీకేకు ఉందని, ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న దృష్ట్యా వ్యూహాలు మారేందుకు అవకాశం ఉందన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని, అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయం డీఎండీకే అవుతుందన్నారు. డీఎండీకే లేకుండా ఏ పార్టీ తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటు చేయలేదని, తాము అనుకుంటే ఫ్రంట్‌ ఏర్పాటవుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో విజయకాంత్‌ ప్రచారం చేస్తారని, ప్రజలను చూడాలని ఆయన కోరుకుంటున్నారన్నారు.

Updated Date - 2020-10-27T16:23:37+05:30 IST