ఏడాది పాటు ఆస్తి పన్నులు రద్దు చేయండి: డీకే

ABN , First Publish Date - 2020-07-22T21:49:57+05:30 IST

కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రజలపై పెనుభారం పడినందున ఏడాది పాటు స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల్లో..

ఏడాది పాటు ఆస్తి పన్నులు రద్దు చేయండి: డీకే

బెంగళూరు: కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రజలపై పెనుభారం పడినందున ఏడాది పాటు స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను రద్దు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కోరారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు.


'కోవిడ్ విపత్కర పరిస్థితులతో ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వారిపై మరింత ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చూడటం అనివార్యం. మానవతా దృక్పథంతో ఏడాది పాటు స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల్లో ఆస్తిపన్నులు పూర్తిగా రద్దు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను' అని ఆ ట్వీట్‌లో డీకే పేర్కొన్నారు. కరోనా సంక్భోభ సమయంలో వలసదారులకు ఖర్చు పెట్టిన మొత్తం ఎంతో ప్రభుత్వం వెల్లడించాలని కూడా ఆయన కోరారు.


'కర్ణాటక ఇమేజ్ బాగా దెబ్బతింది. సమస్యల పరిష్కారంలో కర్ణాటక విఫలమైందనే విషయం మనందరికీ తెలుసు. కార్మికులు, వలసదారులు, ఆహార కిట్లుకు ఎంత ఖర్చు చేశారో ప్రభుత్వం చెప్పాలి. నిజంగానే ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే ఆ వివరాలు వెల్లడించాలి' అని శివకుమార్ మీడియాతో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని డీకే మరోసారి ఆరోపించారు.

Updated Date - 2020-07-22T21:49:57+05:30 IST