హెచ్1బీ వీసాలను నిలిపివేయండి: రిపబ్లికన్ సెనేటర్లు
ABN , First Publish Date - 2020-05-09T09:32:38+05:30 IST
హెచ్1బీ సహా కొన్ని కేటగిరీలకు చెందిన కొత్త గెస్ట్ వర్కర్ వీసాల జారీని ఏడాది పాటు నిలిపివేయాలని కీలక రిపబ్లికన్
వాషింగ్టన్, మే 8: హెచ్1బీ సహా కొన్ని కేటగిరీలకు చెందిన కొత్త గెస్ట్ వర్కర్ వీసాల జారీని ఏడాది పాటు నిలిపివేయాలని కీలక రిపబ్లికన్ సెనేటర్లు నలుగురు డిమాండ్ చేశారు. కొత్త గెస్ట్ వర్కర్ వీసాలను రెండు నెలల పాటు నిలిపివేయాలని అధ్యక్షుడు ట్రంప్‌ను కోరారు. నిరుద్యోగిత శాతం సా ధారణ స్థాయికి వచ్చే వరకు ఆయా వీసాలను మంజూరు చేయొద్దని సెనేట ర్లు టెడ్ క్రూజ్, టామ్ కాటన్, చుక్ గ్రాస్లే, జోష్ హావ్లే ఈ మేరకు అధ్యక్షుడికి రాసిన లేఖలో సూచించారు.