జలుబు, జ్వరం వస్తాయి.. వాటంతటవే తగ్గిపోతాయి: ఐసీఎంఆర్‌

ABN , First Publish Date - 2020-03-23T06:25:14+05:30 IST

కరోనా సోకినా.. భయపెట్టే లక్షణాలేవీ కనిపించవని భారత వైద్యపరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ అంటున్నారు. కరోనా బారినపడే..

జలుబు, జ్వరం వస్తాయి.. వాటంతటవే తగ్గిపోతాయి: ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ, మార్చి 22 : కరోనా  సోకినా.. భయపెట్టే లక్షణాలేవీ కనిపించవని భారత వైద్యపరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ అంటున్నారు. కరోనా బారినపడే వారిలో 80 శాతం మందికి కొద్దిపాటి జలుబుతో కూడిన జ్వరం వచ్చి దానంతటదే తగ్గిపోతుందని తెలిపారు. మిగతా 20 శాతం మంది ఆరోగ్యం మాత్రం ఆస్పత్రిలో చేర్పించేంతగా విషమించే పరిస్థితి ఏర్పడవచ్చన్నారు. అలా ఆస్పత్రుల్లో చేరేవారిలో 5 శాతం మందికి సకాలంలో తగిన చికిత్స, ఔషధాలు అందుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన 75 జిల్లాల్లో అత్యవసర సేవలు మినహా మిగతా విభాగాలను స్తంభింపజేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.

Updated Date - 2020-03-23T06:25:14+05:30 IST