కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కు లేఖ రాసిన బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2020-12-10T17:58:22+05:30 IST

బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కు లేఖ రాసిన బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు

కోల్‌కతా : బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన సందర్భంగా భద్రతా లోపం స్పష్టంగా కనిపించిందని ఆయన ఫిర్యాదు చేశారు. ‘‘ఈ రోజు నడ్డా కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఇందులో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపించాయి. రాష్ట్ర పోలీసు విభాగం నిర్లక్ష్యం కనిపించింది. పార్టీ కార్యాలయం వెలుపల కర్రలు, బాంబులతో దాదాపు 200 మంది మోహరించి కనిపించారు. అందులో కొందరు కార్లపైకి ఎక్కి నినాదాలు చేశారు. నల్ల జెండాలు ఊపుతూ.. నడ్డా కారు వరకూ వచ్చారు. అయినా పోలీసులు ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. వారిని అదుపు చేయలేదు.’’ అని దిలీప్ ఘఓష్ ఆ లేఖలో పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ కారును కేటాయించిందని, అయినా... నడ్డా కాన్వాయ్ మధ్యలో ప్రైవేట్ వాహనాలు కూడా వచ్చాయని, అయినా పట్టించుకోలేదని దిలీప్ ఘోష్ కేంద్ర హోంమంత్రి షాకు లేఖ రాశారు. 

Updated Date - 2020-12-10T17:58:22+05:30 IST