బలపరీక్షా... అంత సీన్ లేదు: దిగ్విజయ్

ABN , First Publish Date - 2020-03-13T00:13:02+05:30 IST

మధ్య ప్రదేశ్‌ అసెంబ్లీలో బలపరీక్ష తప్పదంటూ వస్తున్న వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కొట్టిపారేశారు. ..

బలపరీక్షా... అంత సీన్ లేదు: దిగ్విజయ్

భోపాల్: మధ్య ప్రదేశ్‌ అసెంబ్లీలో బలపరీక్ష తప్పదంటూ వస్తున్న వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కొట్టిపారేశారు. స్పీకర్ ఇప్పటికీ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించలేదనీ.. అలాంటప్పడు బలపరీక్ష ఎలా జరుగుతుందని ఆయన అన్నారు. తమ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలను బీజేపీ చెరబట్టిందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ‘‘19 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఇంకా అమోదించనందున బలపరీక్ష జరిగే అవకాశమే లేదు. వారంతా స్పీకర్ ముందు కనబడి, ఆయనతో మాట్లాడాల్సిందేనన్నారు. ఈ ఎమ్మెల్యేలందర్నీ బీజేపీ నిర్బంధించింది..’’ అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.


2018లో మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆ పార్టీలో అంతర్గత విభేధాలు ముదురుతూ వచ్చాయి. రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఒకరైన జ్యోతిరాదిత్య రాజీనామా చేయడం... ఆయనకు మద్దతుగా 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సీఎం కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-03-13T00:13:02+05:30 IST