ఎయిర్‌పోర్టు బాత్రూంలో దాక్కోలేదు.. ఆ విషయం ఎవరూ చెప్పలేదు: కనికా

ABN , First Publish Date - 2020-03-21T18:13:47+05:30 IST

ప్రముఖ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. ఆమె భారత్‌కు తిరిగొచ్చాక ఏర్పాటు చేసిన పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఎయిర్‌పోర్టు బాత్రూంలో దాక్కోలేదు.. ఆ విషయం ఎవరూ చెప్పలేదు: కనికా

లక్నో: ప్రముఖ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. ఆమె భారత్‌కు తిరిగొచ్చాక ఏర్పాటు చేసిన పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కనికాకు కరోనా సోకిందని తెలియగానే వారంతా క్వారంటైన్‌లోకి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరిగొచ్చిన సమయంలో ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ తప్పించుకోవడం కోసం కనిక.. బాత్రూంలో దాక్కుందంటూ వదంతులు వినిపిస్తున్నాయి. వీటిపై క్వారంటైన్‌లో ఉన్న కనిక స్పందించింది. ఎయిర్‌పోర్టులో  తాను స్క్రీనింగ్ చేయించుకున్నానని స్పష్టంచేసింది. ‘నేనేమీ ఎయిర్‌పోర్టు బాత్రూంలో దాక్కొని స్క్రీనింగ్ తప్పించుకోలేదు. ముంబై ఎయిర్‌పోర్టులో చక్కగా స్క్రీనింగ్ చేయించుకున్నా’ అని చెప్పింది. ఈ నెల 11న తాను స్వదేశానికి వచ్చానని, విదేశాల నుంచి వచ్చిన వారందరూ సెల్ఫ్-క్వారంటైన్‌లో ఉండాలనే సూచనలు ఎవరూ ఇవ్వలేదని పేర్కొంది. 

Updated Date - 2020-03-21T18:13:47+05:30 IST