విమానయాన సంస్థలకు డీజీసీఏ విధించిన మార్గదర్శకాలివీ...

ABN , First Publish Date - 2020-06-01T21:07:45+05:30 IST

విమానయాన సంస్థలకు సివిల్ ఏవియేషన్ అధికారులు కొత్త నిబంధనలను సోమవారం జారీ చేశారు.

విమానయాన సంస్థలకు డీజీసీఏ విధించిన మార్గదర్శకాలివీ...

న్యూఢిల్లీ : విమానయాన సంస్థలకు సివిల్ ఏవియేషన్ అధికారులు కొత్త నిబంధనలను సోమవారం జారీ చేశారు. విమాన ప్రయాణంలో మధ్య సీట్లను ఖాళీగా ఉంచాలని నిర్దేశించింది. అలా వీలుకాని పక్షంలో, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే మాత్రం కేంద్ర జౌళీ మంత్రిత్వ శాఖ ఆమోదించిన గౌన్లు ధరించేలా అదనపు రక్షణ అవకాశాలు కల్పించాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.


ఈ గౌన్లతో పాటు ప్రయాణికులు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలంటూ అన్ని విమానయాన సంస్థలకు డీజీసీఏ మార్గదర్శకాలను విడుదల చేసింది.


‘‘ప్రయాణ సమయంలో మధ్య సీట్లను ఖాళీగా ఉంచండి. అలా వీలుకాని పక్షంలో ప్రయాణికులకు జౌళీ మంత్రిత్వ శాఖ ఆమోదించిన గౌన్లను ఇచ్చి అదనపు రక్షణ చర్యలు చేపట్టండి. ఒకే కుటుంబానికి చెందిన ప్రయాణికులు మాత్రం పక్క పక్కనే కూర్చునే అవకాశం ఉంది’’ అని డీజీసీఏ డైరెక్టర్ సూచించారు.


వీటన్నింటితో పాటు తరుచుగా శానిటైజేషన్ చేయడం, తరుచుగా పారిశుద్ధ్యం చేయడం కేబిన్ ఏయిర్‌ను తరుచుగా మారుస్తుండటం, తాగునీరు, ఆహారం లాంటివి నియంత్రించడం లాంటి నియమాలను ఎలాగూ పాటించాల్సిందేనని డీజీసీఏ పునరుద్ఘాటించింది. 

Updated Date - 2020-06-01T21:07:45+05:30 IST