కరోనా వైరస్‌పై విమానయాన ఉద్యోగులకు డీజీసీఏ హెచ్చరిక

ABN , First Publish Date - 2020-03-04T13:09:16+05:30 IST

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో విమానయాన ఉద్యోగులు, పైలెట్లు, విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్‌లైన్స్ ఆపరేటర్లకు పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్ (డీజీసీఏ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది....

కరోనా వైరస్‌పై విమానయాన ఉద్యోగులకు డీజీసీఏ హెచ్చరిక

న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో విమానయాన ఉద్యోగులు, పైలెట్లు, విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్‌లైన్స్ ఆపరేటర్లకు పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్ (డీజీసీఏ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. విదేశాల నుంచి వ్యాపిస్తున్న కరోనా వైరస్ ముప్పు విమాన ప్రయాణికుల్లో ఎక్కువగా ఉండటంతో డీజీసీఏ విమానయాన ఉద్యోగులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. విమానాల్లో ఉద్యోగులందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, విమానాలు, విమానాశ్రయాల్లోని మరుగుదొడ్లలోనూ పరిశుభ్ర వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీసీఏ ముందస్తు ఆదేశాలు జారీ చేసింది. దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ దేశాల నుంచి భారతదేశానికి వచ్చే విమానాల్లో ప్రయాణికులు దిగాక ఇన్‌ఫెక్షన్ రాకుండా విమానాలను శుభ్రం చేయాలని డీజీసీఏ ఆదేశించింది. విదేశాల నుంచి అంతర్జాతీయ విమానాల్లో వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్కానింగ్ చేశాకే ఇమ్మిగ్రేషన్‌కు పంపించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చే విమానాల్లో కరోనా వైరస్ బాధిత రోగులుంటే ఆయా విమానాలను ఇన్సెక్షన్ లేకుండా శుభ్రం చేయాలని కోరారు. విమాన ప్రయాణికుల్లో కరోనా లక్షణాలుంటే వారిని వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స చేయాలని డీజీసీఏ ఆదేశించింది.

Updated Date - 2020-03-04T13:09:16+05:30 IST