దేవెగౌడకు రూ.60 లక్షల విలువైన వాహనం

ABN , First Publish Date - 2020-09-24T14:30:31+05:30 IST

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు కర్ణాటక ప్రభుత్వం రూ.60 లక్షల విలువ చేసే ఓల్వో కారును సమకూర్చింది.

దేవెగౌడకు రూ.60 లక్షల విలువైన వాహనం

  • మాజీ ప్రధాని కోసం కొనుగోలు చేసిన కర్ణాటక ప్రభుత్వం

బెంగళూరు : మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు కర్ణాటక ప్రభుత్వం రూ.60 లక్షల విలువ చేసే ఓల్వో కారును సమకూర్చింది. ఇంత ఖరీదైన ప్రభుత్వ కారు కలిగిన తొలి ప్రజాప్రతినిధిగా దేవెగౌడ చరిత్ర సృష్టించనున్నారు. ఆయనకు ప్రభుత్వం సమకూర్చిన ఓల్వో ఎక్స్‌సి 60 డి-5 మోడల్‌ కారు మార్కెట్‌ విలువ రూ.59.90 లక్షలు. ఇది ఇతరులెవరైనా కొనుగోలు చేస్తే పన్నులు, బీమా కలిపి రూ74.90 లక్షలవుతుందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి పేరిట ఈ కారును కొనుగోలు చేయడం వల్ల పన్నులన్నీ కలుపుకొని రూ.65 లక్షలైందన్నారు.


రాజ్యసభకు ఎన్నికైన అనంతరం తనకు ఒక కారు కేటాయించాలని మాజీ ప్రధాని చేసిన విజ్ఞప్తికి స్పందించిన ప్రభుత్వం ఈ ఖరీదైన కారును అందించింది. కెఎ 53 జి 3636 రిజిస్ట్రేషన్‌ నెంబరు కలిగిన ఈ కారును దేవెగౌడకు ఇంకా అధికారికంగా అందజేయాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా తనకు ఖరీదైన కారు కావాలని మాజీ ప్రధాని దేవేగౌడ కోరలేదని, రాష్ట్రానికి చెందిన మాజీ ప్రధానిగా ఆయనకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ కారును కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2020-09-24T14:30:31+05:30 IST