ఉద్యోగులకు ఒకింత నిరాశ... వేతనాల పెంపు అంతంత మాత్రమే... వారికి మాత్రమే పదిహేను శాతం

ABN , First Publish Date - 2020-08-13T00:20:08+05:30 IST

కరోనా నేపధ్యంలో ఉద్యోగులకు ఒకింత నిరాశాజనకమైన పరిస్థితులెదురవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... వారి వేతనాలకు సంబంధించి టీమ్‌లీజ్ సంస్థ... 'జాబ్స్ అండ్ శాలరీస్ ప్రైమరీ రిపోర్ట్ 2020' పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది.

ఉద్యోగులకు ఒకింత నిరాశ... వేతనాల పెంపు అంతంత మాత్రమే...  వారికి మాత్రమే పదిహేను శాతం

న్యూఢిల్లీ : కరోనా నేపధ్యంలో ఉద్యోగులకు ఒకింత నిరాశాజనకమైన పరిస్థితులెదురవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... వారి వేతనాలకు సంబంధించి టీమ్‌లీజ్ సంస్థ... 'జాబ్స్ అండ్ శాలరీస్ ప్రైమరీ రిపోర్ట్ 2020' పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది.


ఈ నివేదిక మేరకు...  జీతాల పెంపు అంశంపై కరోనా ప్రభావం చెప్పుకోదగిన స్థాయిలోనే కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నో సంస్థల ఆర్థిక పరిస్థితి క్షీణించిన విషయం తెలిసిందే. దీని నుండి బయటపడిన  కంపెనీలు కూడా పెద్దగా జీతాలు పెంచే స్థితిలో లేవు.  గత ఏడాది వేతనం ఎంత పెరిగిందంటే... అదే సమయంలో 2019 లో కనిష్టంగా10.02 శాతం, గరిష్టంగా 11.11 శాతంగా వేతనాల పెరుగుదల ఉన్నట్లు నివేదిక తెలిపింది. 


దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లోని 17 రంగాలకు చెందిన 2.52 లక్షల మంది ఉద్యోగుల వేతనాలను పరిశీలించిన టీమ్‌లీజ్ ఈ నివేదిక తయారు చేసింది. పెంచిన కంపెనీల విషయానికి వస్తే... 17 రంగాల్లోని 11 రంగాల్లో దాదాపు 10 శాతం కంటే తక్కువగానే వేతనాలు పెరిగాయి. ఇందులో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్స్ అండ్ అలైడ్, నిర్మాణ మరియు రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీడీ, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, బీమా, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అలైడ్, మీడియా అండ్ ఎంటర్‌‌టెయిన్‌మెంట్, పవర్ అండ్ ఎనర్జీ, రిటైల్ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ తదితర రంగాలున్నాయి. 


కరోనా కారణంగా వేతనాల పెంపు స్వల్పంగా లేదా స్థిరంగా ఉండవచ్చునని టీమ్‌లీజ్ తెలిపింది. కొన్ని సంస్థల్లో ప్రతికూలంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. కేవలం సూపర్ స్పెషలైజ్డ్ ప్రొఫైల్స్ లేదా ప్రతిభావంతులకు మాత్రమే 15 శాతం మేరకు వేతనాల పెంపు ఉండవచ్చునని వెల్లడించింది. మొత్తంమీద వివిధ రంగాలతోపాటు ఉద్యోగులూ కరోనా దెబ్బకు మ్రాన్పడాల్సిన పరిస్థితి నెలకొందన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. 


Updated Date - 2020-08-13T00:20:08+05:30 IST