‘జస్ట్ 2 గంటల్లో కరోనా టీకాను డిజైన్ చేశా’

ABN , First Publish Date - 2020-12-13T20:32:56+05:30 IST

టీకాను కేవలం రెండు గంటల్లోనే డిజైన్ చేసినట్టు బయోఎన్‌టెక్ సహవ్యవస్థాపకుడు ఉగుర్ సాహిన్ తెలిపారు

‘జస్ట్ 2 గంటల్లో కరోనా టీకాను డిజైన్ చేశా’

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన కరోనా టీకాకు ఇటీవలే అమెరికాలో అనుమతి లభించింది. అంతకుమునుపే బ్రిటన్ ఈ టీకాకు ఎమర్జెన్సీ ఆథొరైజేషన్ ఇవ్వడంతోపాటూ..టీకా పంపిణీ కూడా ప్రారంభించింది. అయితే..ఈ ఎమ్‌ఆర్ఎన్ఏ టీకా డిజైన్ జనవరిలోనే పూర్తయినట్టు బయోఎన్‌టెక్ సహవ్యవస్థాపకుడు ఉగుర్ సాహిన్ తెలిపారు. తాను ఈ టీకాను కేవలం రెండు గంటల్లోనే డిజైన్ చేసినట్టు తెలిపారు. గతంలో మోడర్నా కూడా ఇంచుమించు ఇదే తరహా ప్రకటన చేసింది. తమ టీకా డిజైన్ రెండు రోజుల్లోనే పూర్తైందని తెలిపింది. టీకా రూపకల్పనలో ఇంతటి వేగానికి కారణం.. శాస్త్రవేత్తలు వినియోగించిన టెక్నాలజీయే అని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండూ ఎమ్‌ఆర్ఎన్ సాంకేతికత ఆధారంగా తయారయ్యాయి. వీటిని డిజైన్ చేసేందుకు కరోనా వైరస్ జన్యుక్రమం తెలిస్తే చాలు. శాస్త్రవేత్తలకు ఇది ముందే తెలియడంతో వారు సునాయశంగా టీకాను డిజైన్ చేశారు. 



Updated Date - 2020-12-13T20:32:56+05:30 IST