కొవిడ్‌ విమానాల్లో డైపర్లు ధరించండి

ABN , First Publish Date - 2020-12-11T08:17:42+05:30 IST

చైనాలో కరోనా ముప్పును నివారించేందుకు ఆ దేశ విమానయాన శాఖ వినూత్న ఆలోచన చేసింది. కొవిడ్‌-19 ముప్పు

కొవిడ్‌ విమానాల్లో డైపర్లు ధరించండి

క్యాబిన్‌ సిబ్బందికి చైనా విమానయాన శాఖ సూచన


బీజింగ్‌, డిసెంబరు 10: చైనాలో కరోనా ముప్పును నివారించేందుకు ఆ దేశ విమానయాన శాఖ వినూత్న ఆలోచన చేసింది. కొవిడ్‌-19 ముప్పు  ఎక్కువగా ఉన్న గమ్యస్థానాలకు వెళ్లే చార్టర్‌ విమానాల్లో డైపర్లు ధరించాలని క్యాబిన్‌ సిబ్బందికి చైనా పౌర విమానయాన శాఖ (సీఏఏసీ) సూచించింది. డైపర్లు ధరిస్తే బాత్‌రూంలను వాడాల్సిన అవసరం రాదని, దీంతో కరోనా ముప్పును నివారించేందుకు వీలు కలుగుతుందని సీఏఏసీ పేర్కొంది.  

Updated Date - 2020-12-11T08:17:42+05:30 IST