ఉజ్జయినిలో.. రాళ్లు రువ్విన వాళ్ల ఇళ్లు నేలమట్టం
ABN , First Publish Date - 2020-12-29T09:21:29+05:30 IST
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీహెచ్‌పీ, బజరంగ్ దళ్, బీజేపీ, సమగ్ర హిందూ సమాజ్ ఆధ్వర్యంలో..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీహెచ్‌పీ, బజరంగ్ దళ్, బీజేపీ, సమగ్ర హిందూ సమాజ్ ఆధ్వర్యంలో.. అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిధుల కోసం భారీ ర్యాలీ తీశారు. ఆ ర్యాలీ బేగంబాగ్ వద్దకు చేరుకోగానే.. కొందరు వ్యక్తులు ఇళ్ల పైనుంచి రాళ్లు రువ్వారు. పక్క చిత్రంలోని మొదటి ఫొటోలో ఉన్నవారు ర్యాలీపై రాళ్ల వర్షం కురిపించారు. దీనిపై సీరియస్ అయిన బీజేపీ సర్కారు.. అలా రాళ్లు రువ్విన వారిని సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా గుర్తించి.. శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య వారి ఇళ్లను పూర్తిగా, పాక్షికంగా కూల్చివేసింది(రెండో ఫొటో). అవన్నీ అక్రమ నిర్మాణాలని, ఇంతకు ముందే నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు.