కేరళలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు పెరిగిన డిమాండ్

ABN , First Publish Date - 2020-05-31T01:29:32+05:30 IST

శవ్యాప్త అష్ట దిగ్బంధనం వల్ల రోజువారీ ఆదాయంపై ఆధారపడేవారు

కేరళలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు పెరిగిన డిమాండ్

తిరువనంతపురం : దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం వల్ల రోజువారీ ఆదాయంపై ఆధారపడేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి అవకాశాలు, ఆదాయం లేకపోవడంతో, తినడానికి తిండి కరువవుతోంది. దీంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు అకస్మాత్తుగా డిమాండ్ పెరిగింది. 


గ్రామాల్లో నివసించేవారికి 100 రోజులపాటు పని కల్పించేందుకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం అమలవుతున్న పథకంలో భాగంగా దరఖాస్తుదారులకు 100 రోజులపాటు పని కల్పిస్తారు. 


నీటి సంరక్షణ కార్యకలాపాలు, భూమి అభివృద్ధి పనులు చౌడు భూములను సాగు యోగ్యమైన భూములుగా తయారు చేయడం, చెరువుల్లో పూడిక తీయడం వంటి పనులను ఈ పథకంలో భాగంగా చేయిస్తారు. పంచాయతీ స్థాయిలో ఈ పనులను కేటాయిస్తారు. 


ఈ పనులు చేయడానికి దరఖాస్తు చేసుకుని, జాబ్ కార్డు పొందవలసి ఉంటుంది. గతంలో ఇళ్ళల్లో పనులు చేసుకునే మహిళలు కూడా ఈ పథకం క్రింద పనులు చేసేందుకు దరఖాస్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 


Updated Date - 2020-05-31T01:29:32+05:30 IST