ఢిల్లీ అల్లర్ల కేసు : విచారణ వాయిదా వేసిన సుప్రీం

ABN , First Publish Date - 2020-03-02T17:49:53+05:30 IST

ఈశాన్య ఢిల్లీ అల్లర్లతో అట్టుడికిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై..

ఢిల్లీ అల్లర్ల కేసు : విచారణ వాయిదా వేసిన సుప్రీం

న్యూ ఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ అల్లర్లతో అట్టుడికిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ సుధీర్ఘ విచారణ జరిగింది. అనంతరం విచారణను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది.


ఇదిలా ఉంటే.. భాగీరథి విహార్‌, గోకుల్‌పురి మురుగునీటి కాలువల్లో ఈ శవాలను వెలికితీయడంతో అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 46కు చేరింది. 254 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు 903 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయుధాల చట్టం కింద 41 మందిపై కేసులు పెట్టారు.


కాగా.. ‘పరిస్థితి పూర్తిగా అదుపులోకొచ్చింది. సాధారణ జనజీవనం ఇబ్బంది లేకుండా సాగుతోంది’ అని సీనియర్‌ పోలీసు అధికారికి మీడియాకు వెల్లడించారు. పోలీసులు ప్రతీ గల్లీలోకి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. సోషల్‌ మీడియా పోస్టులు నమ్మొద్దని, రెచ్చగొట్టేట్లున్నా, బెదిరించేట్లున్నా తమ దృష్టికి తేవాలని కోరారు.

Updated Date - 2020-03-02T17:49:53+05:30 IST