ఢిల్లీ హింసాకాండ: 47 చేరిన మృతులు

ABN , First Publish Date - 2020-03-02T20:58:06+05:30 IST

దేశ రాజధానిలో ఇటీవల చెలరేగిన అల్లర్లు, హింసాకాండలో మృతుల సంఖ్య సోమవారంనాటికి 47కి చేరింది. గురు తేజ్ బహదూర్ ఆసుపత్రిలో 38 మంది కన్నుమూయగా, లోక్ నాయక్ ఆసుపత్రిలో..

ఢిల్లీ హింసాకాండ: 47 చేరిన మృతులు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఇటీవల చెలరేగిన అల్లర్లు, హింసాకాండలో మృతుల సంఖ్య సోమవారంనాటికి 47కి చేరింది. గురు తేజ్ బహదూర్ ఆసుపత్రిలో 38 మంది కన్నుమూయగా, లోక్ నాయక్ ఆసుపత్రిలో ముగ్గురు, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఐదుగురు, జగ్ ప్రవేశ్ చందర్ ఆసుపత్రిలో ఒకరు చికిత్సపొందుతూ కన్నుమూశారు. నాలుగు రోజుల పాటు ఈశాన్య ఢిల్లీలో కొనసాగిన హింసాకాండలో 200 మందికి పైగా గాయపడగా, కోట్లాది రూపాయల మేరకు ఆస్తి నష్టం సంభవించింది. సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనకారుల మధ్య చెలరేగిన ఘర్షణలు మత ఘర్షణల రూపు సంతరించుకున్నాయి.


మృతులను రతన్‌లాల్, ముసస్సర్ ఖాన్, నితిన్ కుమార్, ముబారక్ అలీ, మొహ్మద్ ఇర్ఫాన్, అలోక్ తివారి, మొహ్మద్ షాబాన్, రాహుల్ ఠాకూర్, సంజీత్ ఠాకూర్, అంకిత్ శర్మ, సులేమాన్, అన్వర్, దినేషన్ కుమార్, అక్బరి, వినోద్ కుమార్, వీర్ భన్, అమీర్, హషీమ్, జకీర్, ముషారఫ్, ఫైజన్, అయూబ్, ఇస్తియాక్ ఖాన్, మెహతాబ్, మొహిసిన్ అలి, ముబారక్ హసన్, మొహ్మద్ యూసుఫ్, ప్రేమ్, దీపక్ కుమార్, మెహ్రూఫ్ అలి, అష్ఫఖ్ హుస్సేన్, అమాన్, పర్వేజ్ అలాం, మోనిస్, మొహమ్మద్ ఫుర్కన్, రాహుల్ సోలంకి, సాహిద్ అల్వి, బబ్బు సల్మాని, దిల్బర్ నెగి, అన్వర్ ఖసార్‌గా గుర్తించారు. మరో ఐదు మృతదేహాలు సోమవారంనాడు వెలుగుచూశాయి. వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. కాగా, ఢిల్లీ అల్లర్ల అంశాన్ని కాంగ్రెస్ నేత్వత్వంలోని విపక్షాలు ఇవాళ పార్లమెంటులో లేవనెత్తడంతో గందరగోళ పరిస్థితుల మధ్య ఉభయసభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.

Updated Date - 2020-03-02T20:58:06+05:30 IST