రైతుల నిరసనలు: యూపీ-ఢిల్లీ సరిహద్దులు మూసివేత

ABN , First Publish Date - 2020-12-03T13:20:36+05:30 IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, మంగళవారం రైతులతో ఇద్దరు కేంద్ర మంత్రులు చర్చలు చేసినప్పటికీ అవి సఫలం కాలేదు. కాగా, గురువారం రైతులతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

రైతుల నిరసనలు: యూపీ-ఢిల్లీ సరిహద్దులు మూసివేత

న్యూఢిల్లీ: ఢిల్లీకి సరిహద్దులో రైతులు పెద్ద ఎత్తున నిరసన చేస్తుండడంతో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో యూపీ-ఢిల్లీ సరిహద్దు రహదారులను మూసివేస్తున్నట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. గౌతమ్ బుద్ధ్ ద్వార్ సమీపంలోని నోయిడా లింక్ రోడ్డులోని చిల్లా సరిహద్దును మూసివేశారు. టిక్రి సరిహద్దు, జరోదా సరిహద్దు, జటిక్రా సరిహద్దులను సైతం మూసివేశారు. ఈ సరిహద్దుల్లో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచి పోయింది. ఇక బదుసరాయి సరిహద్దు మాత్రమే తెరిచి ఉన్నప్పటికీ, అక్కడి నుంచి కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.


వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, మంగళవారం రైతులతో ఇద్దరు కేంద్ర మంత్రులు చర్చలు చేసినప్పటికీ అవి సఫలం కాలేదు. కాగా, గురువారం రైతులతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చర్చలు జరపనుంది. ఈ చర్చలకు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ విషయమై బుధవారం తన నివాసంలో మంగళవారం రైతులతో చర్చలు జరిపిన కేంద్ర మంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమై చర్చించారు.

Updated Date - 2020-12-03T13:20:36+05:30 IST