ఢిల్లీ యూనివర్శిటీ వీసీని సస్పెండ్ చేసిన రాష్ట్రపతి రాంనాథ్

ABN , First Publish Date - 2020-10-29T00:09:56+05:30 IST

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆదేశాలతో ఢిల్లీ యూనివర్శిటీ వీసీ ప్రొ. యోగేశ్ త్యాగిని సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. గతవారం

ఢిల్లీ యూనివర్శిటీ వీసీని సస్పెండ్ చేసిన రాష్ట్రపతి రాంనాథ్

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆదేశాలతో ఢిల్లీ యూనివర్శిటీ వీసీ ప్రొ. యోగేశ్ త్యాగిని సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. గతవారం విశ్వవిద్యాలయానికి సంబంధించిన నియామకాల విషయంలో అవకతవకలు జరిగాయని, అందుకే ఆయనపై విచారణ చేపట్టాలంటూ కేంద్ర విద్యాశాఖ రాష్ట్రపతిని కోరింది. అంతేకాకుండా ఆయన ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ‘‘విశ్వవిద్యాలయ సందర్శకునిగా, నిజానిజాలను పరిగణనలోకి తీసుకొని, రికార్డులో ఉన్న వాటిని గుర్తించి వీసీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలి.’’ అంటూ విద్యాశాఖ రాష్ట్రపతి రాంనాథ్‌కు లేఖ రాసింది. ఈ విచారణ ముగిసే వరకూ ప్రొ. త్యాగి విధులకు దూరంగా ఉంటారని, వారి స్థానంలో పీసీ జోషి బాధ్యతలు నిర్వర్తిస్తారంటూ కేంద్ర విద్యాశాఖ ఢిల్లీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది.

Updated Date - 2020-10-29T00:09:56+05:30 IST