ఢిల్లీ అల్లర్ల సందర్భంగా పాక్ నుంచి సోషల్ మీడియా పోస్టులు

ABN , First Publish Date - 2020-03-18T18:11:52+05:30 IST

ఢిల్లీ అల్లర్ల సందర్భంగా పాకిస్థాన్ దేశం నుంచి 1000 సోషల్ మీడియా ఖాతాల ద్వార పలు పోస్టులు పెట్టారని భద్రతా సంస్థల దర్యాప్తులో తేలింది.....

ఢిల్లీ అల్లర్ల సందర్భంగా పాక్ నుంచి సోషల్ మీడియా పోస్టులు

భద్రతా బలగాల దర్యాప్తులో తేలిన నిజం

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల సందర్భంగా పాకిస్థాన్ దేశం నుంచి 1000 సోషల్ మీడియా ఖాతాల ద్వార పలు పోస్టులు పెట్టారని భద్రతా సంస్థల దర్యాప్తులో తేలింది. పాకిస్థాన్ దేశంలోని ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి, లాహోర్ నగరాల నుంచి సోషల్ మీడియాలో అల్లర్లను రేపేలా పోస్టులు పెట్టారని వెల్లడైంది. విద్వేషం నింపే సోషల్ మీడియా పోస్టులకు ఢిల్లీ అల్లర్లు 2020, ఢిల్లీ బర్నింగ్, షేమ్ ఆన్ ఢిల్లీ పోలీసు, ఢిల్లీ పోలీసు ట్రూత్, ఢిల్లీ పోలీసు మర్డర్స్ హ్యాష్ ట్యాగులతో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 3వతేదీ వరకు ఢిల్లీ అల్లర్ల సందర్భంగా పాక్ నగరాల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయని భద్రతాబలగాలు వెల్లడించాయి.


అల్లర్ల సందర్భంగా పోస్టులు పెట్టిన 70 పాక్ సోషల్ మీడియా ఖాతాలను మన భద్రతా బలగాలు గుర్తించాయి. ఢిల్లీ అల్లర్ల సందర్భంగా పెట్టిన కొన్ని ట్వీట్లు పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పెట్టారని భద్రతా బలగాల దర్యాప్తులో బయటపడింది. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించగా, మరో 200 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ఢిల్లీ అల్లర్ల వెనుక పాక్ హస్తం ఉందనే విషయంపై భద్రతా బలగాలు దర్యాప్తు సాగిస్తున్నాయి.

Updated Date - 2020-03-18T18:11:52+05:30 IST