రాజధానిలో స్వల్పంగా తగ్గిన కరోనా ప్రభావం.. లక్షకు అతి చేరువలో కేసులు

ABN , First Publish Date - 2020-07-06T00:57:04+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుతున్నాయి. గత కొన్ని రోజుల వరకు 4వేలకు పైగా...

రాజధానిలో స్వల్పంగా తగ్గిన కరోనా ప్రభావం.. లక్షకు అతి చేరువలో  కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుతున్నాయి. గత కొన్ని రోజుల వరకు 4వేలకు పైగా నమోదయిన కేసులు ఆ తరువాత 3వేల లోపునకు పరిమితమయ్యాయి. ప్రస్తుతం 2,500కంటే తక్కువగా నమోదవుతున్నాయి. అయితే కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తూనే ఉంది. ఈ రోజు కూడా రాష్ట్రంలో 60కి పైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య  శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,244 కరోనా కేసులు నమోదయ్యాయి. 63 మంది మరణించారు. 3,083 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 99,444కి చేరింది. వీరిలో 25,038మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 71,339మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 3,067మంది ప్రాణాలు కోల్పోయారు.
Updated Date - 2020-07-06T00:57:04+05:30 IST