ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్కరోజే 3,900 పైగా..

ABN , First Publish Date - 2020-06-24T02:06:32+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా...

ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్కరోజే 3,900 పైగా..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా ఈ రోజు ఒక్కరోజే రాష్ట్రంలో 3,900కు పైగా పాజిటివ్ కేసులు  నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 66వేలు దాటేసింది. ఇలాగే కొనసాగితే దేశంలోనే అత్యధిక కేసులతో బాధపడుతున్న మహారాష్ట్ర సరసన ఢిల్లీ చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 3,947 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 68 మంది మరణించారు. 2,711 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 66,602కు చేరింది. వీరిలో 24,988మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 39,313మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 2,301మంది ప్రాణాలు కోల్పోయారు.

Read more