ఇంట్లో నుంచి బయటకు రావద్దు..ముస్లింలకు ఢిల్లీ పోలీసుల హెచ్చరిక

ABN , First Publish Date - 2020-04-05T18:01:03+05:30 IST

కరోనా లాక్‌డౌన్ సమయంలో ముస్లింలకు ఢిల్లీ పోలీసులు ఆదివారం హెచ్చరిక జారీ చేశారు.....

ఇంట్లో నుంచి బయటకు రావద్దు..ముస్లింలకు ఢిల్లీ పోలీసుల హెచ్చరిక

న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్ సమయంలో ముస్లింలకు ఢిల్లీ పోలీసులు ఆదివారం హెచ్చరిక జారీ చేశారు. ఏప్రిల్ 8, 9 తేదీల్లో షబ్బే బరాత్ జాగ్నేకీ రాత్ సందర్భంగా ముస్లింలు ఇళ్లలోనుంచి బయటకు రావద్దని ఢిల్లీ పోలీసులు కోరారు. షబ్బే బరాత్ సందర్భంగా ముస్లిం యువకులు బైక్ లపై వీధుల్లోకి రాకుండా ఇళ్లలోనే ఉండాలని పోలీసులు సూచించారు. కరోనా లాక్‌డౌన్ సందర్భంగా ఎవరైనా ముస్లింలు షబ్బే బరాత్ సందర్భంగా ఇళ్లలో నుంచి బయటకు వస్తే అలాంటి వారిపై చట్ట ప్రకార చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. ముస్లిమ్ మత నాయకులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు లాక్ డౌన్ కు సహకరించాలని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు పోస్టర్లతో ప్రచారం చేపట్టారు.

Updated Date - 2020-04-05T18:01:03+05:30 IST