జామియా స్టూడెంట్‌కి ఢిల్లీ పోలీసుల నోటీసు

ABN , First Publish Date - 2020-05-14T01:27:17+05:30 IST

జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్ చందన్ కుమార్‌కు ఢిల్లీ పోలీసులు

జామియా స్టూడెంట్‌కి ఢిల్లీ పోలీసుల నోటీసు

న్యూఢిల్లీ : జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్ చందన్ కుమార్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసు జారీ చేశారు. ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో చందన్‌ను ప్రశ్నించేందుకు నోటీసు జారీ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, సెక్షన్ 43ఎఫ్ ప్రకారం ఈ నోటీసు జారీ చేశారు. 


ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం  ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్ చందన్ కుమార్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసు జారీ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, సెక్షన్ 43ఎఫ్ ప్రకారం ఈ నోటీసు జారీ చేశారు. ఈ నెల 13న మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని చందన్ కుమార్‌ను ఆదేశించారు. ఈ దర్యాప్తుకు గైర్హాజరైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


Read more