క‌రోనాతో కానిస్టేబుల్ మృతి... భార్య‌కు, కుమారునికి పాజిటివ్‌!

ABN , First Publish Date - 2020-05-09T10:45:49+05:30 IST

కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అమిత్ భార్య, అతని మూడేళ్ల కుమారుడు కూడా అంటువ్యాధి....

క‌రోనాతో కానిస్టేబుల్ మృతి... భార్య‌కు, కుమారునికి పాజిటివ్‌!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అమిత్ భార్య, అతని మూడేళ్ల కుమారుడు కూడా అంటువ్యాధి బారిన పడ్డారు. ఇద్దరినీ సోనెపట్ పిజిఐకి త‌ర‌లించారు. కానిస్టేబుల్ అమిత్ కుటుంబం హర్యానాలోని సోనెపట్‌లో ఉంటోంది. కానిస్టేబుల్ మృతి తరువాత వారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యంది. భారత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వ‌హించే కానిస్టేబుల్ మ‌ర‌ణించిన నేప‌ధ్యంలో మృత‌దేహానికి క‌రోనా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.  రిపోర్టు పాజిటివ్‌గా వ‌చ్చింది. కానిస్టేబుల్ అమిత్(32) ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించింది.  ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతూ‌ అమిత్ మరణించాడు. అమిత్‌లో ముందుగా కరోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేదు. అయినా అకస్మాత్తుగా అతని ఆరోగ్యం క్షీణించింది.  ఇదిలావుండ‌గా ఢిల్లీలో కరోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో, కొత్తగా 338 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇద్ద‌రు మృతి చెందారు. ఢిల్లీలో మొత్తం 6318 కరోనా కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు 68 మంది మృత్యువాత‌ప‌డ్డారు. 

Updated Date - 2020-05-09T10:45:49+05:30 IST