కరోనా వేళ రేవ్ పార్టీ.. ఏడుగురు యువతులతో సహా 31 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-16T04:31:32+05:30 IST

ఢిల్లీలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతంలో...

కరోనా వేళ రేవ్ పార్టీ.. ఏడుగురు యువతులతో సహా 31 మంది అరెస్ట్

న్యూఢిల్లీ: ఢిల్లీలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతంలో ఓ లోకల్ క్లబ్‌లో జరుగుతున్న రేవ్ పార్టీ గుట్టు రట్టయింది. పార్టీ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన పోలీసులు 31 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురు యువతులు కూడా ఉన్నారు. మద్యం బాటిళ్లను, హుక్కాను సీజ్ చేశారు. క్లబ్ యజమానిని, అతని సోదరుడిని అరెస్ట్ చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి పార్టీని నిర్వహించినందుకు పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.


మంగళవారం రాత్రి ఈ పార్టీ జరిగింది. పోలీసులు రైడ్స్ చేసిన సమయంలో పలువురు యువతీయువకులు మద్యం మత్తులో తేలియాడుతున్నట్లు తెలిసింది. వీరిలో ఢిల్లీకి చెందిన పలువురు బడాబాబుల కొడుకులు, కుమార్తెలు ఉన్నట్లు సమాచారం.Updated Date - 2020-07-16T04:31:32+05:30 IST