క‌రోనా కేసుల్లో ముంబైని మించిపోతున్న ఢిల్లీ!

ABN , First Publish Date - 2020-06-21T13:53:10+05:30 IST

దేశంలో ఇంత‌వ‌ర‌కూ క‌రోనాకు ముంబై అత్య‌ధికంగా ప్ర‌భావితం కాగా, ఇప్పుడు ఆ స్థానంలోకి ఢిల్లీ వ‌చ్చిచేరింది. జూన్ 12 నుండి ఢిల్లీలో ప్రతిరోజూ రెండువేల కేసులు నమోదవుతున్నాయి. ముంబైలో....

క‌రోనా కేసుల్లో ముంబైని మించిపోతున్న ఢిల్లీ!

న్యూఢిల్లీ: దేశంలో ఇంత‌వ‌ర‌కూ క‌రోనాకు ముంబై అత్య‌ధికంగా ప్ర‌భావితం కాగా, ఇప్పుడు ఆ స్థానంలోకి ఢిల్లీ వ‌చ్చిచేరింది. జూన్ 12 నుండి ఢిల్లీలో ప్రతిరోజూ రెండువేల కేసులు నమోదవుతున్నాయి. ముంబైలో ఇంకా అటువంటి ప‌రిస్థితి చోటుచేసుకోలేదు. జూన్ 18 న ఢిల్లీ, చెన్నై న‌గ‌రాల్లో ముంబై క‌న్నా అధికంగా కేసులు నమోద‌య్యాయి. ఢిల్లీలో క‌రోనా కేసులు దేశంలోని మిగిలిన‌ ప్రాంతాల కంటే అత్యంత వేగంగా రెట్టింపు అవుతున్నాయి. కేవలం 12 రోజుల్లో ఇక్కడ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. దేశంలో మొత్తం కేసులు, మ‌ర‌ణాల్లో ‌ఢిల్లీకి గణనీయమైన వాటా ఉంది. ఇప్పటివరకు దేశంలో ధృవీకరించిన‌ మొత్తం కేసులలో 13 శాతం ఢిల్లీ నుండి మాత్రమే నమోదయ్యాయి. జూన్ 18 నాటికి భారతదేశంలో మొత్తం 3,81,095 కేసులు నమోదయ్యాయి, అందులో 49,979 కేసులు ఢిల్లీకి చెందిన‌వి. దేశంలో నమోదైన మొత్తం మరణాలలో 15 శాతానికి పైగా ఢిల్లీ నుంచే ఉన్నాయి. జూన్ 18 నాటికి భారతదేశంలో 12,606 మరణాలు సంభవించగా, 1,969 మంది ఢిల్లీలో మృతిచెందారు. 


Updated Date - 2020-06-21T13:53:10+05:30 IST