ఢిల్లీతోపాటు ఉత్త‌రాదిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు

ABN , First Publish Date - 2020-07-19T13:33:27+05:30 IST

దేశ‌రాజ‌ధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తరాదిన ప‌లు ప్రాంతాల్లో ఈరోజు ఉద‌యం నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా...

ఢిల్లీతోపాటు ఉత్త‌రాదిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు

న్యూఢిల్లీ: ‌దేశ‌రాజ‌ధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తరాదిన ప‌లు ప్రాంతాల్లో ఈరోజు ఉద‌యం నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆహ్లాద‌క‌ర వాతావర‌ణం ఏర్ప‌డింది. ప్ర‌జ‌ల‌కు ఉపశమనం లభించ‌న‌ట్ల‌య్యింది. ఢిల్లీలో భారీ వర్షం కార‌ణంగా అనేక చోట్ల రోడ్లపైకి నీరు వ‌చ్చిచేరింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో చిరుజ‌ల్లుల‌తో పాటు అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడురోజుల్లో హర్యానా, పంజాబ్, హిమాచల్‌లో భారీ వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా వాతావరణ శాఖ ఈ రాష్ట్రాల్లో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో ఆదివారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

Updated Date - 2020-07-19T13:33:27+05:30 IST