ఢిల్లీ -ముంబై విమాన, రైల్వే సర్వీసుల రద్దు?

ABN , First Publish Date - 2020-11-21T13:08:28+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ- ముంబై నగరాల మధ్య విమాన, రైలు సర్వీసులను నిలిపివేయాలని ....

ఢిల్లీ -ముంబై విమాన, రైల్వే సర్వీసుల రద్దు?

ముంబై (మహారాష్ట్ర) : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ- ముంబై నగరాల మధ్య విమాన, రైలు సర్వీసులను నిలిపివేయాలని మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే సర్కారు యోచిస్తోంది. కరోనా వైరస్ ఢిల్లీ నుంచి ముంబైనగరానికి వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర సర్కారు యోచిస్తోంది. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ చేయాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఢిల్లీ నుంచి ముంబైకు వెళుతున్న రైళ్లను రద్దు చేసే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని  రైల్వే మంత్రిత్వశాఖ తాజాగా ట్వీట్ చేసింది.


 ఢిల్లీలో అక్టోబరు 28వేతేదీ నుంచి కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజుకు 5వేల మార్కు దాటింది. నవంబరు 11వతేదీ నాటికి ఢిల్లీలో రోజుకు  8వేల మందికి కరోనా సోకింది. నవంబరు 19న ఢిల్లీలో 7,546 కరోనా కేసులు వెలుగుచూశాయి. శుక్రవారం 6,685 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో ఢిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించారు. మాస్కులు ధరించాలని, సామాజికదూరం పాటించాలని ఢిల్లీ సర్కారు ప్రజలను కోరింది. ఢిల్లీ నుంచి నోయిడాకు వచ్చే ప్రయాణికులను కూడా బుద్ధనగర్ జిల్లా సరిహద్దుల్లో కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. 

Updated Date - 2020-11-21T13:08:28+05:30 IST