లాక్ డౌన్ లో వారి కోసం మెట్రో ఫ్రీ సర్వీస్
ABN , First Publish Date - 2020-04-01T11:58:04+05:30 IST
కరోనా ప్రమాదాన్ని నివారించేందుకు ఢిల్లీలో లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో మెట్రో సేవలను నిలిపివేశారు. అయితే పోలీసు వర్గాల కోసం...

న్యూ ఢిల్లీ: కరోనా ప్రమాదాన్ని నివారించేందుకు ఢిల్లీలో లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో మెట్రో సేవలను నిలిపివేశారు. అయితే పోలీసు వర్గాల కోసం మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. దీనితో డ్యూటీలో ఉన్న పోలీసులకు వెసులుబాటు కలుగుతుంది. పోలీస్ సిబ్బంది కోసం ఢిల్లీలోని 5 మెట్రో లైన్లకు సంబంధించిన అన్ని స్టేషన్లలో నుండి రైళ్లు నడుస్తున్నాయి. పోలీసుల గుర్తింపు కార్డులను చూసి వారికి మెట్రో స్టేషన్లలో ప్రవేశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఒక షెడ్యూల్ కూడా సిద్ధం చేశారు. దానిప్రకారం పోలీసు సిబ్బంది మెట్రోలో రాకపోకలు చేయవచ్చు. కాగా లాక్ డౌన్ నియమాలను మరింత ఖఠినం చేసిన దృష్ట్యా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.