కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక ఉత్తర్వులు

ABN , First Publish Date - 2020-06-20T03:42:13+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా లక్షణాలు తక్కువగా ఉండి పాజిటివ్ వచ్చిన వారికి, లక్షణాలే లేకుండా...

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక ఉత్తర్వులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా లక్షణాలు తక్కువగా ఉండి పాజిటివ్ వచ్చిన వారికి, లక్షణాలే లేకుండా పాజిటివ్ వచ్చిన వారికి 5 రోజుల ఇన్ స్టిట్యూషనల్ క్వారంటైన్ ను తప్పనిసరి చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ ఇలా తక్కువ లక్షణాలు కనిపిస్తూ పాజిటివ్ వచ్చిన వారికి, లక్షణాలే లేకుండా పాజిటివ్ వచ్చిన వారికి హోం క్వారంటైన్ లో ఉంచి ఢిల్లీ ప్రభుత్వం వైద్య సేవలు అందించింది.


అయితే.. హోం క్వారంటైన్ ను కరోనా పేషెంట్లు సక్రమంగా పాటించక పోవడం వల్ల ఢిల్లీలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయని, ఢిల్లీలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని కేంద్రం భావించింది.


దీంతో.. 5 రోజుల ప్రభుత్వ క్వారంటైన్ ను తప్పనిసరి చేసింది. ఢిల్లీలో దాదాపు 8500 మంది కరోనా పేషంట్లు హోం క్వారంటైన్ లో ఉన్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో వారందరినీ ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లకు తరలించాల్సి ఉంటుంది. అయితే.. ఈ నిర్ణయం పట్ల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విముఖంగా ఉంది.



Updated Date - 2020-06-20T03:42:13+05:30 IST