ఢిల్లీ -కట్రా వందేభారత్ రైలు త్వరలో ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-08T18:08:33+05:30 IST
శ్రీమాత వైష్ణోదేవి ఆలయం త్వరలో తెరవనున్న నేపథ్యంలో ఢిల్లీ-కట్రా వందేభారత్ రైలు సర్వీసును త్వరలో ప్రారంభించనున్నట్లు...

కేంద్రమంత్రి వెల్లడి
న్యూఢిల్లీ : శ్రీమాత వైష్ణోదేవి ఆలయం త్వరలో తెరవనున్న నేపథ్యంలో ఢిల్లీ-కట్రా వందేభారత్ రైలు సర్వీసును త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ గురువారం వెల్లడించారు.జమ్మూకశ్మీరులో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నదృష్ట్యా జమ్మూకశ్మీరులోని కట్రాకు రైలు సర్వీసులను పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు.జమ్మూకశ్మీర్ ఉధంపూర్ నియోజకవర్గ ఎంపీ అయిన మంత్రి జితేంద్రసింగ్ రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి వందేభారత్ రైలు సర్వీసును పునర్ ప్రారంభిస్తున్నామని చెప్పారు.కరోనా వ్యాప్తి వల్ల మార్చి నెలలో రద్దు చేసిన ఈ రైలు సర్వీసు పునర్ ప్రారంభించనున్నారు.