ఢిల్లీ జల్ బోర్డు ఉద్యోగికి కరోనా..10 మంది ఉద్యోగుల క్వారంటైన్
ABN , First Publish Date - 2020-05-19T10:46:36+05:30 IST
ఢిల్లీ జల్ బోర్డు ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో ఆ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు....

న్యూఢిల్లీ : ఢిల్లీ జల్ బోర్డు ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో ఆ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్ -19 సోకిన ఉద్యోగిని ఆసుపత్రి క్వారంటైన్ కు తరలించారు. కరోనా సోకిన ఉద్యోగితో కలిసి ఢిల్లీలోని ఠాగూర్ గార్డెన్ లో పనిచేసిన మరో పదిమంది ఉద్యోగులను ముందస్తు జాగ్రత్తగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్ చేశారు. జల్ బోర్డు జోనల్ ఇంజినీరుతోపాటు 10 మందిని హోం క్వారంటైన్ చేసి అవసరమైతే వైద్యచికిత్స పొందాలని సూచించామని ఢిల్లీ జల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు చెప్పారు. కరోనా వచ్చిన ఉద్యోగి పనిచేసిన ఠాగూర్ గార్డెన్ జల్ బోర్డు యూనిట్ ను 14 రోజుల పాటు ముందు జాగ్రత్తగా మూసివేస్తున్నట్లు ఢిల్లీ జల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వివరించారు.