23న బ్లాక్‌ డే పాటించాలి : ఐఎంఏ

ABN , First Publish Date - 2020-04-21T11:57:16+05:30 IST

23న బ్లాక్‌ డే పాటించాలి : ఐఎంఏ

23న బ్లాక్‌ డే పాటించాలి : ఐఎంఏ

న్యూఢిల్లీ: కరోనాపై పోరాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 23న బ్లాక్‌డే పాటించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ రాజన్‌ శర్మ, గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్వీ అశోకన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు దేశంలోని డాక్టర్లంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని కోరారు. దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22 రాత్రి 9 గంటలకు ఆస్పత్రులలో క్యాండిల్స్‌ వెలిగించి నిరసన తెలపాలని  డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-04-21T11:57:16+05:30 IST