లాక్‌డౌన్ 3.0లో మూడింతలు కోలుకున్న బాధితులు!
ABN , First Publish Date - 2020-05-17T13:23:04+05:30 IST
కరోనావైరస్‌పై పోరాటంలో భాగంగా విధించిన లాక్‌డౌన్ 3.0లో ఆశాజనకమైన ఫలితాలు వెలుగుచూశాయి. మొదటి రెండు దశలతో పోలిస్తే మూడవ దశలో ఢిల్లీలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న రోగుల సంఖ్య...

న్యూఢిల్లీ: కరోనావైరస్‌పై పోరాటంలో భాగంగా విధించిన లాక్‌డౌన్ 3.0లో ఆశాజనకమైన ఫలితాలు వెలుగుచూశాయి. మొదటి రెండు దశలతో పోలిస్తే మూడవ దశలో ఢిల్లీలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న రోగుల సంఖ్య మూడు రెట్లకు పెరిగింది. ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం లాక్డౌన్ 3.0కి ముందు మే 3 వరకు ఢిల్లీలో మొత్తం 1362 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. లాక్‌డౌన్ 3.0లోని మొదటి 13 రోజులలో (మే 4 నుంచి 16 వరకు) కోలుకున్న వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది. మే 16 నాటికి ఢిల్లీలో 3926 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాజధానిలో కరోనా కారణంగా వృద్ధులలో అత్యధిక మరణాలు సంభవించాయి. 60 లేదా అంతకు మించిన వయసు కలిగిన 62 మంది మృతిచెందారు. 50 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల వారి మరణాల సంఖ్య 35 కాగా, 50 ఏళ్లలోపు వారి మరణాల సంఖ్య 26గా ఉంది.